హనుమకొండ:వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కుటుంబం పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది.
కాంగ్రెస్ నాయకుడు బొంత సారంగపాణి తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో వారు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ తీవ్ర ఆరోపణలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


