HomeWarangal Newsవరి కొయ్యకాళ్లు కాల్చుతూ ఘోర ప్రమాదం.. మంటల్లో రైతు మృతి..!

వరి కొయ్యకాళ్లు కాల్చుతూ ఘోర ప్రమాదం.. మంటల్లో రైతు మృతి..!

Published on

spot_img

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యకాళ్లని కాల్చేందుకు పెట్టిన మంటలు అదుపుతప్పడంతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన రేగొండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో శనివారం జరిగింది.

గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే రైతు తన వ్యవసాయ భూమిలో వరి కొయ్య కాళ్ళని తగలబెట్టాడు. అయితే గాలి వేగం కారణంగా మంటలు ఒక్కసారిగా పక్కనే ఉన్న పొలాల వైపు వ్యాపించాయి. దీంతో మంటలు విస్తరిస్తుండడాని గమనించిన చంద్రమౌళి వెంటనే వాటిని ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను ఆందోళనతో పరుగులు తీస్తూ ప్రమాదవశాత్తు మంటల్లా మధ్యలో పడిపోయాడు.

మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు రాలేక అక్కడే సజీవదహనమయ్యాడు. ఘటనను గమనించిన స్థానిక రైతులు గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలకు దిగిన అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో జయశంకర భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక చర్యలు చేపట్టారు.

అనంతరం మంటలను అదుపులోకి తీసుకొని ఘటనపై విచారణ ప్రారంభించారు. రైతు మృతితో రేపాకపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో అప్రమత్తత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరొకసారి గుర్తు చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles