HomeLatest Newsఅమ్మతనానికి కొత్త అర్థం చెప్పిన Gutta Jwala..60 లీటర్ల తల్లిపాలు దానం..!

అమ్మతనానికి కొత్త అర్థం చెప్పిన Gutta Jwala..60 లీటర్ల తల్లిపాలు దానం..!

Published on

spot_img

అమ్మతనానికి కొత్త అర్థం చెప్పిన Gutta Jwala..60 లీటర్ల తల్లిపాలు దానం:

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్రీడల్లో దేశానికి గౌరవం తీసుకొచ్చిన ఆమె..ఇప్పుడు తల్లిపాల దానంతో ఎంతోమంది శిశువుల జీవితాలలో ఆశా కిరణంగా నిలుస్తున్నారు. తల్లిపాలకు దూరమైన చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నై ప్రభుత్వ ఆసుపత్రుల్లోని నవజాత శిశువులకు తన చనుబాలును అందిస్తూ సేవా భావాన్ని చాటుతున్నారు.

ప్రతిరోజు సుమారు 600 మిల్లీలీటర్ల తల్లిపాలను దానం చేస్తున్న గుత్తా జ్వాల ఇప్పటివరకు దాదాపు 60 లీటర్ల పాలను అందించినట్లు తెలిపారు. ఈ తల్లిపాలు ముఖ్యంగా తల్లిని కోల్పోయిన లేదా తల్లిపాలు అందని శిశువులకు ఎంతో మేలు చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. “తల్లిపాలను “లిక్విడ్ గోల్డ్” అని పిలుస్తారని.. వాటిలో శిశువుల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు యాంటీ బాడీ లు సమృద్ధిగా ఉంటాయని” జ్వాలా పేర్కొన్నారు.

తన బిడ్డకు అవసరమైనంత పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను వృధా చేయకుండా ఇతర చిన్నారులకు ఉపయోగపడేలా దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రతి తల్లి కూడా వీలైనప్పుడు “బ్రెస్ట్ మిల్క్ డొనేషన్” పై అవగాహన పెంచుకోవాలని.. ఇది సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆమె సూచించారు. క్రీడల్లోనూ, సేవల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న గుత్తాజ్వాల 2010 మరియు 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకాలు సాధించి భారతదేశానికి గర్వకారణమయ్యారు. ఇప్పుడు తల్లిపాల దానంతో మరోసారి సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

నవోదయ సీటు మీ లక్ష్యమా? ప్రిపరేషన్ ఇలా ఉంటే సక్సెస్ పక్కా!

నవోదయ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్, పరీక్ష విధానాన్ని అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలి. రోజువారీ ప్రాక్టీస్, మాక్ టెస్టులు, టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడితే పరీక్షకు మెరుగ్గా సిద్ధం కావచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.