వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో ఫోర్ట్ వరంగల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ సామర్థ్యాన్ని పెంచారు.
ఈ సబ్‌స్టేషన్‌లోని PTR సామర్థ్యాన్ని 5 MVA నుండి 8 MVAకు పెంచి, విజయవంతంగా ఛార్జ్ చేశారు. విద్యుత్ సంస్థ (TGNPDCL) చేపట్టిన ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’లో భాగంగా ఈ పనులను పూర్తి చేశారు. పెరిగిన వేసవి విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూ,వినియోగదారులకు అంతరాయం లేని మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ఈ పెంపు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.


