హన్మకొండ: సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి దివ్య ఆశీస్సులతో, ములుగు రోడ్డులోని శ్రీ సత్యసాయి బాబా ఆలయంలో నేటి (ఏప్రిల్ 15) నుండి ఉచిత పాలిసెట్ (POLYCET) కోచింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
శిక్షణకు వచ్చే విద్యార్థులు తమ వెంట తల్లిదండ్రులను తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. అలాగే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మరియు పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫామ్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.


