హనుమకొండ: హంటర్ రోడ్డులోని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న యోగా మరియు లైబ్రరీ కేంద్రాలకు ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడుతూ, విద్యార్థులు, యువత మరియు స్థానిక ప్రజల ప్రయోజనం కోసం ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ విజ్ఞప్తిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారు. యోగా, లైబ్రరీ కేంద్రాల నిర్మాణ పనుల నిమిత్తం ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.


