HomeWarangal Newsప్రేమ పేరుతో మోసం: యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్

ప్రేమ పేరుతో మోసం: యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్

Published on

spot_img

గీసుగొండ, వరంగల్: ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి ఉదయ్ శంకర్ (29) అనే యువకుడు బాధిత యువతితో పదో తరగతి నుంచే పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

​పెళ్లి పేరుతో నమ్మించి, ఆపై బెదిరింపులకు గురిచేస్తూ బాధితురాలిపై పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరగా.. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులను చంపేస్తానని నిందితుడు బెదిరింపులకు దిగాడు.

అరెస్ట్ జరిగిన తీరు:

​ఏప్రిల్ 24వ తేదీ రాత్రి నిందితుడు ఉదయ్ శంకర్ బాధితురాలి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించగా, స్థానికులు పట్టుకుని నిలదీశారు. ఆ సమయంలో కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అయితే, మరుసటి రోజు బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి వెళ్లి మాట్లాడగా.. నిందితుడితో పాటు అతని తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ కలిసి బాధితులను దూషించి, చంపుతామని బెదిరించారు.

​బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ఉదయ్ శంకర్‌ను మంగళవారం సాయంత్రం ఊకల్లు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...