గీసుగొండ పీఎస్ పరిధిలో గంజాయి కేసు: ముగ్గురు నిందితుల అరెస్ట్, 242 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు పెట్రోలింగ్ సమయంలో పోలీసులకు అనుమానం కలగడంతో నలుగురు వ్యక్తులపై దాడి చేసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 242 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం ఇస్తే రహస్యంగా భద్రత కల్పిస్తామని గీసుగొండ పోలీసులు ప్రజలను కోరారు. ఈ విషయంలో ఎవరైనా సమాచారం ఉంటే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సీఐకి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.


