చిల్పూర్ మండలం | తేది : 24-01-2026
చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి తోకల హృతిక్ రెడ్డి ఇటీవల జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందారు.
నేడు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు నేడు మల్కాపూర్ గ్రామానికి చేరుకొని హృతిక్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హృతిక్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ గారు పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
యువ వయసులోనే హృతిక్ రెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఈ ఘటనను తలుచుకుంటే హృదయం కలిచివేస్తోందని అన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విద్యార్థి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని లోటుగా మారిందని పేర్కొన్న ఎంపీ గారు, హృతిక్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, సర్పంచ్ లావణ్య మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్, మాజీ కార్పొరేటర్ మాధవి, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


