HomeWarangal Newsఘనపూర్ మున్సిపాలిటీలో 18కి 18 వార్డులు గెలిపి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: ఎంపీ కడియం కావ్య

ఘనపూర్ మున్సిపాలిటీలో 18కి 18 వార్డులు గెలిపి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: ఎంపీ కడియం కావ్య

Published on

spot_img

స్టేషన్ ఘనపూర్, జనవరి 30 (న్యూస్): ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బేదాభిప్రాయాలు పక్కనపెట్టి, అందరూ కలిసికట్టుగా పనిచేసి 18 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు.

స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఘనపూర్ మున్సిపాలిటీ నాయకులు, ఆశావహులు, వార్డు ఇంచార్జ్‌లతో జరిగిన సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ బలాన్ని చూపించాలని, చిన్నచిన్న బేదాభిప్రాయాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని కోరారు.

Dr Kadiyam Kavya
Dr Kadiyam Kavya

అందరికీ ఒకేసారి అవకాశాలు రావని, ప్రజాధారణ ఉన్నవారికి, గెలిచే అవకాశం ఉన్నవారికే పార్టీ టికెట్ ఇస్తుందని, ఆ నిర్ణయం పక్కా సర్వేల ఆధారంగా పిసిసి తీసుకుంటుందని వివరించారు.

అవకాశం రాని వారు నిరుత్సాహపడవద్దని, కష్టపడే కార్యకర్తలను పార్టీ ఎల్లవేళలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికే రూ.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, కాంగ్రెస్ గెలిస్తే మరో రూ.50 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత తమది, ఎమ్మెల్యే శ్రీహరిది అని హామీ ఇచ్చారు.

ప్రతిపక్ష నాయకులు ఎలాగైనా ఈ మున్సిపాలిటీని గెలుచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, ఆశావహులు, వివిధ మండలాల నుంచి వచ్చిన వార్డు ఇంచార్జ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.