యువతకు ఉపాధి అవకాశం – టూరిజం గైడ్‌గా మారేందుకు సువర్ణావకాశం:
తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించే దిశగా మరో కీలక కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, దేవాలయ ప్రాంతాలపై అవగాహన కలిగిన యువతను ప్రోత్సహిస్తూ “టూరిస్ట్ గైడ్” అవకాశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాధాన్యత గల ప్రాంతాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అనంతరం వారికి “టూరిస్ట్ గైడ్” గా గుర్తింపు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం గుర్తింపు పొందిన “టూరిస్ట్ గైడ్” సర్టిఫికేట్ అందజేయనున్నారు. తద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులకు మార్గదర్శకులుగా పనిచేసే అవకాశం లభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, భద్రాచలం, రామప్ప దేవాలయం, యాదాద్రి, బొగ్గుగుట్టలు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీరికి మంచి అవకాశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. స్థానిక చరిత్రపై అవగాహనతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలిగిన వారికి ప్రాధాన్యత ఉండనుందని వెల్లడించారు.
అర్హతలు:
- తెలంగాణ చరిత్ర సంస్కృతి దేవాలయాలు మరియు పర్యాటక ప్రదేశాలపై అవగాహన ఉండాలి.
- చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
- పర్యాటక రంగంపై ఆసక్తి ఉండాలి.
- అభ్యర్థులు గూగుల్ ఫామ్ https://docs.google.com/forms/d/e/1FAIpQLSdfLenWj-5csepK7CfawDDJEWC21PJaGbDjT8M0wsYS8k_9ww/viewform ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అవకాశం ద్వారా పర్యాటక రంగంలో కెరియర్ను నిర్మించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.


