RAC (Reservation Against Cancellation) ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ కోచ్‌ల్లో ఇక నుంచి కో-ప్యాసింజర్లతో బెడ్ రోల్స్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ప్రత్యేక బెడ్ రోల్ కిట్ ఇస్తామని ప్రకటించింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా RACలో ఇద్దరు ప్రయాణికులకు ఒకే బెర్త్ రావడం వల్ల రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


