Google Gemini 3.5 Flash అంటే ఏమిటి?
Google ప్రకటించిన Gemini 3.5 Flash ఒక వేగవంతమైన AI మోడల్. ఇది తక్కువ లేటెన్సీతో స్పందిస్తూ కోడింగ్, కంటెంట్ రైటింగ్, చాట్ అసిస్టెన్స్, రీసెర్చ్ వంటి పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించబడింది.
ప్రపంచ టెక్ దిగ్గజం Google తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ గూగుల్ I/O 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలక ప్రకటన చేసింది.
AI టెక్నాలజీ పై మరింత దృష్టి సారించిన గూగుల్ కొత్త ఏఐ మోడల్ అదేవిధంగా వాయిస్ టూల్స్ మీడియా జనరేషన్ ప్లాట్‌ఫామ్స్, అధునాతన ఏఐ చిప్స్ ను పరిచయం చేసింది.
వినియోగదారులు వ్యాపార సంస్థల కోసం మరింత వేగవంతమైన మరియు స్మార్ట్ ఏఐ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా ఈ ప్రకటనలు చేసినట్లు సంస్థ తెలిపింది.

Gemini 3.5 Flashతో వేగవంతమైన AI అనుభవం:
ఈ కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొత్తగా Gemini 3.5 Flash మోడల్ ప్రకటించారు.
ఇది తక్కువ లేటెన్సీ తో వేగంగా స్పందించే ఏఐ మోడల్ గా రూపొందించబడింది అంటూ చెప్పుకొచ్చారు.
కోడింగ్, కంటెంట్, రైటింగ్ , రీసెర్చ్, చాట్, అసిస్టెన్స్ వంటి పనుల్లో ఈ మోడల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది అంటూ గూగుల్ వెల్లడించింది.

Gemini Spark: పనులను స్వయంగా చేసే AI అసిస్టెంట్:
గూగుల్ పరిచయం చేసిన మరొక ముఖ్యమైన ఫీచర్ Gemini Spark.
ఈ AI అసిస్టెంట్ Gmail అదేవిధంగా Google Drive వంటి గూగుల్ యాప్ లలో వినియోగదారుల తరఫున పనులు నిర్వహించగలదు.
పార్టీ ప్లానింగ్ కోసం RSVP లు కూడా సేకరించడం జరుగుతుంది.
అదేవిధంగా Emails పంపడం.. రిమైండర్లు సెట్ చేయడం.. ప్రజెంటేషన్లు తయారు చేయడం వంటి పనులను ఆటోమేటిక్ గా పూర్తి చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది.
ల్యాప్ టాప్ మూసి వేసిన సరే బ్యాక్ గ్రౌండ్ లో పనులు కొనసాగించే విధంగా దీనిని డిజైన్ చేశారు.

Omniతో ఆడియో, వీడియో, ఇమేజ్ జనరేషన్:
Omni అనే కొత్త మీడియా జనరేషన్ టూల్ ను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ Text, Images, ఆడియో, వీడియోలను ఏఐ సహాయంతో సృష్టించగలదు.
సాధారణ వాయిస్ కమాండ్స్ తో వీడియోలను ఎడిట్ చేయడం స్టైల్స్ మార్చడం సీన్స్ సవరించడం వంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి.
దీనిని యూట్యూబ్ షాట్స్ తో అనుసంధానం చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.

Google Docs Liveతో వాయిస్ ద్వారానే డాక్యుమెంట్లు:
“Google Docs Live” అనే పేరుతో Google కొత్త వాయిస్ ఆధారిత డాక్యుమెంట్ టూల్‌ను కూడా ప్రకటించింది.
వినియోగదారులు మాట్లాడుతుండగా ఆ మాటలను రియల్ టైమ్‌లో డాక్యుమెంట్ రూపంలో మార్చే విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

TPU 8t, TPU 8i AI చిప్స్ ఆవిష్కరణ:
AI ట్రైనింగ్ మరియు ఇన్ఫరెన్స్ పనుల కోసం గూగుల్ TPU 8t, TPU 8i AI అనే రెండు కొత్త AI చిప్స్‌ను విడుదల చేసింది.
సంస్థ ప్రకారం TPU 8t చిప్ పాత తరహా చిప్స్‌తో పోలిస్తే మూడు రెట్లు అధిక కంప్యూటింగ్ శక్తిని అందిస్తుంది.
ఒకే డేటా సెంటర్ పరిమితులను దాటి AI ట్రైనింగ్‌ను భారీ స్థాయిలో స్కేల్ చేయగల సామర్థ్యం ఈ చిప్స్‌కు ఉందని Google వెల్లడించింది.
సెకనుకు సుమారు 1,500 టోకెన్ల వరకు ఇన్ఫరెన్స్ Speed అందించగలవని, పవర్ వినియోగంలో కూడా మెరుగైన సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపింది.
AI Ultra సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభం:
AI సేవలను మరింత విస్తరించే క్రమంలో Google “Google AI Ultra” అనే కొత్త Subscription plan ను కూడా ప్రారంభించింది.
ఈ ప్లాన్ ధర నెలకు 100 Dollars గా నిర్ణయించింది. అలాగే ఇప్పటికే ఉన్న టాప్-టియర్ Ultra ప్లాన్ ధరను 250 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించింది.
AI పోటీలో గూగుల్ కొత్త వ్యూహం:
ప్రపంచవ్యాప్తంగా AI రంగంలో పోటీ తీవ్రంగా పెరుగుతున్న సమయంలో Google ఈ ప్రకటనలు చేసింది.
వ్యక్తిగత వినియోగదారుల నుంచి పెద్ద సంస్థల వరకు అందరికీ ఉపయోగపడే విధంగా AI టూల్స్‌ను మరింత శక్తివంతంగా మార్చడంపై సంస్థ దృష్టి పెట్టినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
FAQ’s
1. Gemini 3.5 Flash ను Google ఎప్పుడు ప్రకటించింది?
Google I/O 2026 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించింది.
2. Gemini 3.5 Flash ప్రత్యేకత ఏమిటి?
ఇది వేగంగా స్పందించే Low Latency AI మోడల్.
3. ఈ AI మోడల్ ఏ పనులకు ఉపయోగపడుతుంది?
కోడింగ్, కంటెంట్ రైటింగ్, రీసెర్చ్, చాట్ అసిస్టెన్స్ వంటి పనులకు ఉపయోగపడుతుంది.
4. Google కొత్తగా ఇంకేమి ప్రకటించింది?
AI వాయిస్ టూల్స్, మీడియా జనరేషన్ ప్లాట్ఫార్మ్స్ మరియు AI చిప్స్‌ను ప్రకటించింది.
5. Gemini AI వల్ల ఎవరికీ ఎక్కువ ప్రయోజనం?
డెవలపర్లు, బిజినెస్ సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, స్టార్టప్‌లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


