HomeWarangal Newsగోపాల్‌పూర్‌లో రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గోపాల్‌పూర్‌లో రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Published on

spot_img

హన్మకొండ: నగరంలోని గోపాల్‌పూర్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఊర చెరువు కట్ట రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు చెరువు పొంగి పొర్లడం వల్ల స్థానిక కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, దీనివల్ల వరద ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోందని ప్రజాప్రతినిధులు తెలిపారు. కాలనీల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, కుడా (KUDA) చైర్మన్, స్థానిక కార్పొరేటర్లు మరియు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles