హనుమకొండ జిల్లా నూతన డీఎంహెచ్ఓ (DMHO)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎస్.డి. రాంకుమార్ను ప్రభుత్వ వైద్యుల సంఘం హనుమకొండ యూనిట్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి. మదన్మోహన్రావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీకృష్ణరావు, కార్యదర్శి డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ గౌతమ్ చౌహాన్ మరియు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


