హనుమకొండ: హనుమకొండ చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఎన్‌ఐటీ గెస్ట్‌హౌస్‌లో భేటీ
హనుమకొండకు చేరుకున్న గవర్నర్‌కు నిట్ (NIT) గెస్ట్‌హౌస్‌లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌తో కలిసి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
మీ బిజినెస్‌ను వేల మందికి చేరవేయండి – FREE LISTING చేయండి

వారితో పాటు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎన్ పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో హనుమకొండ నగరంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
అధికారులతో సమన్వయ సమావేశం
గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లా పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చలు జరిగినట్లు సమాచారం. పర్యటనకు ముందుగానే అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి.
హనుమకొండ చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పర్యటనలో అధికారిక సమావేశాలు, పలు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
Read Warangal News and Latest Politics News and Real EstateALSO READ…..
హనుమకొండకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా: లోపాలు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆర్డర్
రేపు హనుమకొండకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా: పర్యటన వివరాలు ఇవే..


