వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు హక్కు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల నుంచి మొత్తం 2,49,010 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హనుమకొండ జిల్లా నుంచి 68,057, వరంగల్ నుంచి 66,956 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:
- హనుమకొండ – 68,057
- వరంగల్ – 66,956
- మహబూబాబాద్ – 53,718
- జనగామ – 35,418
- భూపాలపల్లి – 15,337
- ములుగు – 9,524
మొత్తం దరఖాస్తుల్లో 1,76,920 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుండగా, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.


