హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హనమకొండ హంటర్ రోడ్డులోని D కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి హనుమకొండ డీసీసీ అధ్యక్షులు వరంగల్ కుడా చైర్మన్ శ్రీ ఇనగల వెంకట్రామ్ రెడ్డి గారు ఘనస్వాగతం పలికారు. D కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకున్న వేం నరేందర్ రెడ్డి గారిని పూలమాలలు, శాలువాలతో సత్కరిస్తూ పార్టీ నాయకులు ఆత్మీయంగా ఆహ్వానించారు.
కార్యకర్తలు నినాదలతో సభ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వేం నరేందర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పొగిడేశారు.
హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగల వెంకట్రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేం నరేంద్ర రెడ్డి గారి సేవలు విశేషం అన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఆయన మరింత బాధ్యతతో రాష్ట్ర ప్రజలు తరపున గళం వినిపిస్తారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను పార్లమెంటు వేదికగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు”.


