HomeWarangal Newsవేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం.. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం.. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య

Published on

spot_img

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారికి హనుమకొండలో నిర్వహించిన సన్మానోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యగారు పాల్గొని వేం నరేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. “తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న వేం నరేందర్ రెడ్డి గారు రాజ్యసభకు ఎన్నిక కావడం రాష్ట్రానికి గర్వకారణం అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నాయకుడిగా ఆయన తెలంగాణ స్వరాన్ని దేశస్థాయిలో మరింత బలంగా వినిపిస్తారని అన్నారు”.

“దేశంలో జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్భయంగా పోరాడుతున్నారని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుంది అని తెలిపారు”. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తుంటే..వేం నరేందర్ రెడ్డి ఆ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని కొనియాడారు. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో వేం నరేందర్ రెడ్డి చేసిన కృషి విశేషమని పొగిడేసారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles