మానవ హక్కులపై అవగాహన పెంచేందుకు NHRC జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తోంది. విజేతలకు రూ.2 లక్షల వరకు బహుమతులు అందిస్తారు.
NHRC ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.
ఇలాంటి మరిన్ని విద్యా, పోటీల వార్తల కోసం Greater Warangal News ను ఫాలో అవ్వండి.
ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను జూన్ 30 లోగా nhrcshortfilm@gmail.com కు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా పంపాలి. విజేతలకు మొదటి బహుమతిగా రూ. 2 లక్షలు, రెండో బహుమతి రూ. 1.50 లక్షలు, మూడో బహుమతి రూ. లక్ష అందజేస్తారు. మానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా తమ ఎంట్రీలను పైన పేర్కొన్న మెయిల్ ఐడికి పంపాల్సి ఉంటుంది.
FAQ’s
ప్రశ్న: ఎంట్రీలు పంపే చివరి తేదీ?
జూన్ 30
ప్రశ్న: ఎక్కడ పంపాలి?
nhrcshortfilm@gmail.com
ప్రశ్న: మొదటి బహుమతి ఎంత?
రూ.2 లక్షలు.


