హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను బల్దియా కమిషనర్ వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరైన పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా స్థానిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైప్లైన్ పనులతో పాటు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆ ప్రాంతంలో పారిశుధ్య పనుల తీరును తనిఖీ చేశారు. పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పరిశుభ్రతను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


