హనుమకొండ: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా బుధవారం హనుమకొండ నగరంలోని పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రాంపూర్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అభివృద్ధి పనుల పరిశీలన సందర్భంగా సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా చూసుకోవాలని,ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
మీ బిజినెస్‌ను వేల మందికి చేరవేయండి – Free Listing చేయండి
స్టార్మ్‌వాటర్ డ్రైయిన్ల తనిఖీ
అనంతరం నగరంలో ఇప్పటికే పూర్తయిన స్టార్మ్‌వాటర్ డ్రైయిన్లను (వరద నీటి కాలువలు) కమిషనర్ పరిశీలించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటి పారుదల సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. డ్రైయిన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా నీరు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో బల్దియా ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం అభివృద్ధి పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మరోసారి దిశానిర్దేశం చేశారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

