హైదరాబాద్, మార్చి 17, 2026:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో శానిటేషన్ మరియు ఇతర పనుల నిర్వహణను మెరుగుపర్చేందుకు 250 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని కలిశారు.
హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే మరియు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొని వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రస్తుతం సంబంధిత ఫైల్ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉందని, దానిని ఈ నెలాఖరు నాటికి ఆమోదించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
👉 దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, మార్చి నెలాఖరు లోపు మంజూరు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


