గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పన్ను వసూళ్ల పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సర్కిల్ వారీగా వసూళ్ల పరిస్థితిని పరిశీలించారు.

👉 ఈ నెల ముగియడానికి కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని అధికారులు తెలిపారు.
👉 పన్నులపై ఎలాంటి రీబేట్ అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
👉 ప్రజల్లో అవగాహన పెంచుతూ ప్రస్తుత మరియు పాత బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని సూచించారు.
👉 అధికారులు గడపగడపకు వెళ్లి పన్నులు వసూలు చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
📌 నగర అభివృద్ధికి పన్నుల వసూళ్లు కీలకమని, ప్రతి ఒక్కరూ సమయానికి చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


