HomeLatest Newsబీటెక్‌తో HALలో ఉద్యోగాలు.. 120 పోస్టులకు నోటిఫికేషన్

బీటెక్‌తో HALలో ఉద్యోగాలు.. 120 పోస్టులకు నోటిఫికేషన్

Published on

spot_img

ఉద్యోగాలు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి 120 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఆగస్టు 14, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

120 పోస్టులు.. విభాగాల వారీగా:

మొత్తం 120 పోస్టుల్లో డిజైన్ ట్రైనీ 60, మేనేజ్‌మెంట్ ట్రైనీ 60 పోస్టులు ఉన్నాయి. డిజైన్ ట్రైనీ పోస్టుల్లో ఏరోనాటికల్ 4, ఎలక్ట్రికల్ 7, ఎలక్ట్రానిక్స్ 20, ఇన్‌స్ట్రుమెంటేషన్ 3, మెకానికల్ 22, కంప్యూటర్ సైన్స్ 3, మెటలార్జీ 1 పోస్టులు ఉన్నాయి. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్లో ఎలక్ట్రికల్ 11, ఎలక్ట్రానిక్స్ 12, మెకానికల్ 27, కంప్యూటర్ సైన్స్ 1, మెటలార్జీ 2, ప్రొడక్షన్ 5, సివిల్ 2 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు, వయోపరిమితి:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, EWS అభ్యర్థులు కనీసం 70 శాతం, SC, ST, PwBD అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2026 ఆగస్టు 14 నాటికి అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో పరీక్ష, సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

దరఖాస్తు వివరాలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 29 నుంచి ఆగస్టు 14 వరకు స్వీకరిస్తారు. SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. పూర్తి వివరాల కోసం HAL అధికారిక వెబ్‌సైట్ hal-india.co.in ను సందర్శించాలి.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.