హన్మకొండ: దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించే ‘జనగణన-2027’ పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ లోని ఎంజీఎం (MGM) జంక్షన్ వద్ద ఈ ర్యాలీ ఉత్సాహంగా మొదలైంది. ములుగు రోడ్ జంక్షన్ మీదుగా సాగుతూ, హన్మకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడి వరకు కొనసాగింది.
2027 జనగణనలో ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు కోరారు.జనగణన అనేది కేవలం అంకెలు మాత్రమే కాదని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే ఖచ్చితమైన సమాచారం అవసరమని వారు పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


