HomeWarangal Newsహన్మకొండలో యూపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..!

హన్మకొండలో యూపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..!

Published on

spot_img

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి స్వయంగా సందర్శించి పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగాయా అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు.

హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్‌బీ కళాశాలతో పాటు బాలసముద్రంలోని నేషనల్ హై స్కూల్ (ఎస్సార్ ఎడ్యుకేషన్) వంటి ముఖ్య పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి కేంద్రంలో పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, వైద్య సేవలు, అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీరు, ఫ్యాన్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ముఖ్యంగా దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సహాయక సిబ్బందిని నియమించి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు.

పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్నదని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.