HomeWarangal Newsరోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ ఆర్థిక సాయం

రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ ఆర్థిక సాయం

Published on

spot_img

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

హసన్‌పర్తి: కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయంగా హసన్‌పర్తి పోలీసు శాఖ రూ.1.05 లక్షలు అందించింది. ఇటీవల కోమల్ల టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కానిస్టేబుల్ పారుపల్లి ధనుంజయ్ కుటుంబానికి హసన్‌పర్తి పోలీసు శాఖ అండగా నిలిచింది.

 జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం కునూరు గ్రామానికి చెందిన ధనుంజయ్, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారు. ​ఆదివారం హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ మహేందర్ తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది మృతుడి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మంజూరు చేసిన రూ. 30,000 దహన సంస్కారాల ఖర్చుల నగదుతో పాటు, హసన్‌పర్తి స్టేషన్ సిబ్బంది స్వచ్ఛందంగా సేకరించిన రూ. 75,000 (మొత్తం రూ. 1,05,000) ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

​ఈ సందర్భంగా సీఐ మహేందర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేసే ధనుంజయ్ మరణం పోలీసు శాఖకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులో అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు త్వరగా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది, మృతుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles