HomeWarangal Newsహన్మకొండలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు – 12 మంది అరెస్ట్

హన్మకొండలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు – 12 మంది అరెస్ట్

Published on

spot_img

హన్మకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న గట్ల రాజేష్ సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల సమాచారం మేరకు, నిందితులు Cric666.live అనే వెబ్‌సైట్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేలు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. వరంగల్, హన్మకొండ, జనగామ ప్రాంతాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, కూలీలను లక్ష్యంగా చేసుకుని ఈ బెట్టింగ్ దందా కొనసాగుతున్నట్లు వెల్లడైంది.

ALSO READ: హన్మకొండలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.. 11 మంది అరెస్ట్

దాడుల సందర్భంగా నిందితుల వద్ద నుంచి రూ.1,06,000 నగదు మరియు 12 స్మార్ట్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. అనంతరం అరెస్ట్ చేసిన వారిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ కోసం కేయూసీ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ మాట్లాడుతూ, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లలో పాల్గొంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ALSO READ: వరంగల్‌లో ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles