HomeWarangal Newsమహిళల ఆరోగ్యంపై విస్తృత అవగాహన అవసరం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

మహిళల ఆరోగ్యంపై విస్తృత అవగాహన అవసరం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

హనుమకొండ, తేది: 08-04-2026

హనుమకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Dr. Kadiyam Kavya హాజరయ్యారు.

Dr Kadiyam Kavya

ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సంరక్షణపై సమగ్ర అవగాహన కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. గర్భధారణకు ముందే మహిళలు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

ఇటీవల కాలంలో వైకల్యాలు, ఆటిజం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో గర్భధారణ ప్రణాళిక దశ నుంచే సరైన పోషకాహారం, వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Poster Launch

రక్తహీనత (అనీమియా), సికిల్ సెల్ వంటి వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతంలో హిమోగ్లోబిన్ లోపం తక్కువగా ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

గర్భిణీలు తప్పనిసరిగా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా గర్భస్థ శిశువులో లోపాలను గుర్తించే TIFFA స్కానింగ్‌ను సమయానికి చేయించుకోవాలని తెలిపారు. ప్రసవానంతర దశలో తల్లుల మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు.

సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వైద్య అధికారులకు సూచించారు. కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలని, వైద్య సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే Naini Rajender Reddy, నగర మేయర్ Gundu Sudharani, డిప్యూటీ మేయర్ Rizwana Shameem Masood, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles