హన్మకొండ నియోజకవర్గ ప్రజలకు మరియు వివిధ పనినిమిత్తం తహశీల్దారు కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు ముఖ్య గమనిక. ఇప్పటివరకు సర్క్యూట్ గెస్ట్ హౌస్ ఆవరణలో కొనసాగుతున్న హన్మకొండ తహశీల్దారు కార్యాలయం నూతన భవనంలోకి మార్చబడింది.
సుబేదారిలోని జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయానికి తహశీల్దారు ఆఫీసును తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రేపు (01.09.2026) అనగా మంగళవారం నుండి ఈ నూతన భవనం (జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయం) నుంచే హన్మకొండ తహశీల్దారు కార్యాలయానికి సంబంధించిన అన్ని రకాల పాలనాపరమైన కార్యకలాపాలు మరియు ప్రజా సేవలు ప్రారంభమవుతాయి.
ఈ మార్పును గమనించి, ప్రజలు తమ రెవెన్యూ మరియు ఇతర అర్జీల కోసం సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్దకు కాకుండా సుబేదారిలోని జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయానికి రావలసిందిగా కోరడమైనది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


