HomeWarangal Newsహనుమకొండ జిల్లా వార్షిక రుణ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్.. రూ.17,479 కోట్ల రుణాల లక్ష్యం

హనుమకొండ జిల్లా వార్షిక రుణ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్.. రూ.17,479 కోట్ల రుణాల లక్ష్యం

Published on

spot_img

హనుమకొండ: హనుమకొండ జిల్లా వార్షిక రుణ ప్రణాళికకు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.17,479 కోట్ల భారీ రుణ లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా రైతులు, స్వయం ఉపాధి దారులు, చిన్న పరిశ్రమలు (MSME), విద్యార్థులు, గృహ రుణాల లబ్ధిదారులు సహా మొత్తం 3,10,691 మందికి రుణాలు అందించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల

ఈసారి రూపొందించిన హనుమకొండ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.1,995 కోట్ల మేర పెరగడం విశేషం. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రణాళిక ప్రత్యేకతగా అధికారులు పేర్కొన్నారు.

 బ్యాంకు అధికారులతో విస్తృతంగా సమావేశమై, సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ రుణ ప్రణాళికకు కలెక్టర్ తుది రూపం ఇచ్చారు.

ఈ ప్రణాళిక ద్వారా జిల్లాలోని మొత్తం 3,10,691 మంది లబ్ధిదారులకు రూ. 17,479 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇది 2025-26 వార్షిక రుణ ప్రణాళిక (రూ. 15,484 కోట్లు) కంటే రూ. 1,995 కోట్లు (15 శాతం) ఎక్కువ కావడం గమనార్హం.

రంగాల వారీగా రుణాల కేటాయింపులు:

 • ప్రాధాన్యత రంగం: ఈ రంగానికి అత్యధికంగా రూ. 8,978 కోట్లు (51.37 శాతం) కేటాయించారు.

 • ప్రాధాన్యతేతర రంగం: ఈ రంగానికి రూ. 8,500 కోట్లు (48.63 శాతం) రుణాలు ఇవ్వనున్నారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయం మరియు దాని అనుబంధ వృత్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పెద్దపీట వేశారు.

 • మొత్తం వ్యవసాయ రంగం: 1,55,412 మంది రైతులకు రూ. 4,586 కోట్లు (26.24 శాతం) రుణాలు అందించాలని నిర్దేశించారు.

 • పంట రుణాలు: ఇందులో భాగంగా 1,47,728 మంది రైతులకు రూ. 4,031 కోట్లు (23.06 శాతం) పంట రుణాలుగా ఇవ్వనున్నారు. పంట ఉత్పత్తులు, నిర్వహణ, మార్కెటింగ్ కింద 1,14,997 మంది రైతులకు రూ. 2,418.98 కోట్లు కేటాయించారు.

 • వ్యవసాయ కాలిక రుణాలు: 32,731 మంది రైతులకు రూ. 1,611.89 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

 • మౌలిక సదుపాయాల కల్పన & అనుబంధ వృత్తులు: వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 116.13 కోట్లు, అనుబంధ వృత్తులకు రూ. 438.90 కోట్లు అందజేస్తారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME)

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగాల కింద 10,547 మందికి రూ. 3,502 కోట్లు (20.23 శాతం) ఇవ్వాలని ప్రతిపాదించారు.

మీ బిజినెస్‌ను వేల మందికి చేరవేయండి – FREE LISTING చేయండి​

ఇతర ప్రాధాన్యత రంగాలు: 

ఇతర ప్రాధాన్యత రంగాల కింద మొత్తం రూ. 891 కోట్లు (5.10 శాతం) కేటాయించారు. దీని క్రింద:

 • విద్యా రుణాలు: 1,290 మంది విద్యార్థులకు రూ. 135.50 కోట్లు.

 • గృహ రుణాలు: 1,290 మందికి రూ. 135.50 కోట్లు.

 • సామాజిక ఇన్ఫ్రాస్ట్రక్చర్: 50 మందికి రూ. 144.18 కోట్లు.

 • పునరుత్పాదక శక్తి (రిన్యూవబుల్ ఎనర్జీ): 29 మందికి రూ. 9.16 కోట్లు.

 • ఓపీఎస్ తదితర రంగాలు: 638 మందికి రూ. 119.70 కోట్లు.

 • ఇతర ప్రాధాన్యతా రంగాలు: 3,118 మందికి రూ. 891 కోట్లు.

ప్రాధాన్యతేతర రంగం

ప్రాధాన్యతేతర రంగం కింద మొత్తం 1,41,614 మందికి రూ. 8,500 కోట్లు (48.63 శాతం) రుణాలు ఇవ్వనున్నారు. ఇందులో:

 • ఎన్‌పీఎస్ అగ్రికల్చర్: 539 మందికి రూ. 555 కోట్లు.

 • ఎన్‌పీఎస్ విద్యారుణాలు: 359 మందికి రూ. 86 కోట్లు.

 • ఎన్‌పీఎస్ గృహ రుణాలు: 3,851 మందికి రూ. 1,152 కోట్లు.

 • ఎన్‌పీఎస్ వ్యక్తిగత రుణాలు: 68,500 మందికి రూ. 1,276 కోట్లు.

 • ఎన్‌పీఎస్ ఇతరాలు: 68,365 మందికి రూ. 5,431 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

బ్యాంకుల భాగస్వామ్యం

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక అమలులో లీడ్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలో మొత్తం 43 బ్యాంకులు పాలుపంచుకుంటున్నాయి.

 ఇందులో:

 * పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు: 11

 * ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు: 20

 * గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్‌బీ): 2

 * స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు: 8

వందశాతం లక్ష్య సాధనకు కృషి

గత ఆర్థిక సంవత్సరం (2025-26) వార్షిక రుణ వితరణలో ప్రాధాన్యత రంగంలో 97.54 శాతం, ప్రాధాన్యతేతర రంగంలో 79.17 శాతం చొప్పున.. మొత్తంగా 88.69 శాతం సాధించామని లీడ్ బ్యాంక్ మేనేజర్ మహేందర్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ బ్యాంకర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించి ఈ 2026-27 వార్షిక రుణ ప్రణాళికకు తుది రూపం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం మించి అమలు అయ్యేలా కృషి చేస్తున్నామని, లబ్ధిదారులకు రుణాలు అందజేయడానికి భాగస్వామ్య బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

మొత్తంగా హనుమకొండ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక జిల్లాలో రైతులు, యువత, వ్యాపారవేత్తలు, మహిళా స్వయం సహాయక సంఘాలు మరియు చిన్న పరిశ్రమలకు ఆర్థికంగా బలాన్ని అందించే కీలక ప్రణాళికగా మారనుంది. నిర్ణయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తే జిల్లాలో అభివృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.