హనుమకొండ జిల్లాలోని 54వ డివిజన్‌లో జిల్లా కలెక్టర్/బల్దియా కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ గారు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆస్తి పన్ను, నల్లా పన్ను వసూళ్ల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, నిర్ణయించిన లక్ష్యాలను తప్పకుండా చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పన్ను వసూళ్లలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించిన కలెక్టర్, ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమర్థవంతంగా వసూళ్లు చేపట్టాలని సూచించారు. నగర అభివృద్ధికి పన్నులు ముఖ్యమైన వనరులని పేర్కొంటూ, అధికారులు బాధ్యతతో పనిచేయాలని తెలిపారు.


