హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy గారి ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం అమలుపై మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ Chahat Bajpai పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడం, ప్రభుత్వ పథకాల పురోగతిని సమీక్షించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించినట్లు సమాచారం.


