HomeWarangal Newsప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: దామెరలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటన

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: దామెరలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటన

Published on

spot_img

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. మంగళవారం ఆమె దామెర మండలంలో విస్తృతంగా పర్యటించారు.

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా దామెర క్రాస్ రోడ్డులోని గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పులుకుర్తిలోని పామాయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటి, ఉద్యానవన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.

 మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలోని రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్యుల సేవలు, మందుల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక మండల అధికారులు, రెవెన్యూ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.