మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్న శిశుగృహం (ప్రత్యేక దత్తత విభాగం – SAA), జిల్లా బాలల సంరక్షణ సేవలు (DCPU) కేంద్రాలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రాలలో ఉన్న సౌకర్యాలు, బాలల సంరక్షణ విధానాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పోషకాహారం, వైద్య సేవలు, విద్యా సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్రాలలో ఉన్న పిల్లలకు నాణ్యమైన సంరక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాలల భద్రత, ఆరోగ్యం, అభివృద్ధి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
అలాగే, దత్తత ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమగ్ర సేవలు అందించాలని తెలిపారు.


