హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం సుబేదారిలోని బాల సదనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. బాల సదనంలోని వసతులను పరిశీలించడమే కాకుండా, అక్కడి విద్యార్థినులతో కలిసి ఆమె భోజనం చేశారు.
బాలికలు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు.
నర్సింగ్‌లో సీట్లు సాధించిన ఇద్దరు బాలికలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లక్ష్మీ ప్రసన్న అనే బాలికకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.


