HomeWarangal Newsహన్మకొండ: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి

హన్మకొండ: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి

Published on

spot_img

హన్మకొండ జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, వారి చిరకాల వాంఛ అయిన కమ్యూనిటీ భవన నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో వేలాది మంది దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించుకోవడానికి లేదా శిక్షణా కార్యక్రమాలు చేపట్టడానికి సరైన వేదిక లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రధానంగా విన్నవించారు.

​అలాగే, ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి అందేలా చూడాలని కోరారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం నాయకులు ఎండి. అజీమ్, శ్రీకాంత్ మరియు ఇతర సంఘ సభ్యులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.