హన్మకొండ: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీ టీచర్లు మరియు హెల్పర్‌లకు కనీస వేతనం రూ. 18 వేలు చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే క్రమంలో సీఐటీయూ కార్యదర్శి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అంగన్‌వాడీల నిరసన కారణంగా ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


