HomeWarangal Newsలండన్ కౌన్సిలర్‌గా హన్మకొండ బిడ్డ.. పూజిత శ్రీనివాస్ ఘన విజయం

లండన్ కౌన్సిలర్‌గా హన్మకొండ బిడ్డ.. పూజిత శ్రీనివాస్ ఘన విజయం

Published on

spot_img

హన్మకొండ జిల్లాకు చెందిన ఒక సాధారణ యువతి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళిన ఆమె, అక్కడ రాజకీయాల్లో రాణించి కౌన్సిలర్‌గా ఎన్నికై వరంగల్ కీర్తిని ఖండాంతరాలు దాటించింది.

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన పూజిత శ్రీనివాస్ లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ వార్డు నుంచి గ్రీన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించింది.

​ పూజిత అత్తమామలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. ఆమె అత్త కడదూరి సరోజన మాజీ సర్పంచ్‌గా, మామ కడదూరి కుమారస్వామి మాజీ ఎంపీటీసీగా సేవలందించారు.

​ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళిన పూజిత, చదువుతో పాటు అక్కడి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సేవా దృక్పథమే నేడు ఆమెను కౌన్సిలర్ పీఠంపై కూర్చోబెట్టింది. సొంత ఊరి అమ్మాయి లండన్ రాజకీయాల్లో చక్రం తిప్పడం పట్ల ఆమె గ్రామస్తులు మరియు వరంగల్ వాసులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.