హనుమకొండ: హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే:
కమలాపూర్‌కు చెందిన కంది రమేష్, శ్రీనివాస్ అనే అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదంలో శ్రీనివాస్ కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి.
ఈ విషయమై విచారణ జరిపేందుకు పోలీసులు కంది రమేష్‌తో పాటు ఆయన కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రమేష్ భార్య కంది శృతి రాత్రి సమయంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
అక్కడ మనస్తాపానికి గురైన ఆమె, స్టేషన్ ఆవరణలోనే ఓ రసాయనం (విషం) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన పోలీసులు, స్థానికులు ఆమెను 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


