హనుమకొండ జిల్లాలోని కనకదుర్గ కాలనీలో రాత్రి సమయంలో ఓ ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,17,850 నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడ్డ నిందితులను తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.


