HomeWarangal Newsహనుమకొండలో తీవ్ర విషాదం..పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత..!

హనుమకొండలో తీవ్ర విషాదం..పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత..!

Published on

spot_img

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూశాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన న్యూరోమస్క్యులర్ (Neuromuscular) వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమించడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతని మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పవన్ కళ్యాణ్ పరామర్శ మరువలేని జ్ఞాపకం:

నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడటంతో పాటు అతడికి ధైర్యం చెప్పారు. పవన్ సినిమాల పాటలకు నిరంజన్ చేసిన డాన్స్ వీడియోలను చూసి ప్రశంసించిన ఆయన, అభిమానంతో అతడిని హత్తుకుని పలకరించారు. అందరూ తనను ప్రేమగా “చోటా గబ్బర్ సింగ్” అని పిలుస్తారని నిరంజన్ చెప్పగా పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.

‘ఓజీ’ కలిసి చూద్దామన్న మాట కలగానే మిగిలింది:

పరామర్శ సందర్భంగా పవన్ కళ్యాణ్ నిరంజన్‌తో కలిసి ‘OG’ సినిమా చూడాలని, భవిష్యత్తులో ‘OG 2’ తెరకెక్కితే అందులో తన ప్రత్యేక అతిథిగా ఉండాలని ప్రేమగా హామీ ఇచ్చారు. అలాగే పలు బహుమతులు అందించడంతో పాటు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదాలను కూడా అందజేశారు. ఆ ఆత్మీయ క్షణాలు ఇంకా అందరి మదిలో నిలిచి ఉండగానే నిరంజన్ మృతి చెందడం పవన్ అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. సోషల్ మీడియాలో పలువురు అభిమానులు నిరంజన్‌కు నివాళులు అర్పిస్తూ, అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో నిరంజన్ గడిపిన ఆ చివరి ఆత్మీయ క్షణాలు ఇప్పుడు అందరికీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles