HomeWarangal Newsరిటైర్డ్ పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేస్తా | ఎంపీ డా.కడియం కావ్య

రిటైర్డ్ పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేస్తా | ఎంపీ డా.కడియం కావ్య

Published on

spot_img

హన్మకొండ: రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల పెన్షనర్స్‌ డే & డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

రిటైర్డ్ పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేస్తా…. ఎంపీ డా.కడియం కావ్య

హనుమకొండ లోని రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల పెన్షనర్స్‌ డే & డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సేవలను స్మరించుకొని వారి అనుభవాలు సమాజానికి ఎంతో మార్గదర్శకమని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం డైరీని ఆవిష్కరించి, సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Dr Kadiyam Kavya
Dr Kadiyam Kavya

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ,...పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

రిటైర్డ్ కళాశాల అధ్యాపకులు విద్యా రంగానికి అందించిన సేవలు అమూల్యమైనవని, వారి కృషి వల్లే అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.

హన్మకొండ పెన్షనర్స్ డే కార్యక్రమం కడియం కావ్య

పదవీ విరమణ అనంతరం కూడా అధ్యాపకులు తమ జ్ఞానం, అనుభవాలను సమాజహితానికి వినియోగించుకోవడం అభినందనీయమని అన్నారు. పెన్షనర్ల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.

రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘ భవన అభివృద్ధికి 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే ప్రస్తుతం లీజుపై ఉన్న భవనాన్ని మరో 30 సంవత్సరాల పాటు లీజు పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

సీనియర్ సిటిజన్స్‌ అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హన్మకొండ పెన్షనర్స్ డే కార్యక్రమం కడియం కావ్య

పదవీ విరమణ చేసిన అధ్యాపకులు తమ అనుభవాలు, జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా కొనసాగించాలన్నారు.

వచ్చే పెన్షనర్స్ డే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలు పరస్పర ఆత్మీయతను, ఐక్యతను పెంపొందిస్తాయని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పులిసారంగాపాని, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సెక్రటరీ మల్లారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సెక్రెటరీ రాజయ్య, జాయింట్ సెక్రెటరీలు కృష్ణమూర్తి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest articles

పిల్లలకు ఫోన్ అలవాటు మాన్పించాలా? తల్లిదండ్రులు ఇలా చేయండి!

పిల్లలకు ఫోన్ అలవాటు ఎక్కువైందా? స్క్రీన్ టైమ్‌ను క్రమంగా తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా ఆటలు, పుస్తకాలు, కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే.

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...