HomeWarangal Newsవిద్యుత్ స్తంభాల నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

విద్యుత్ స్తంభాల నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

Published on

spot_img

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో విద్యుత్ స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని NPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

హనుమకొండ పున్నేల్ రోడ్‌లోని స్వర్ణ, ఉజ్వల, మంచుకొండ విద్యుత్ స్తంభాల తయారీ కేంద్రాలను సీఎండీ స్వయంగా సందర్శించి, తయారీ ప్రక్రియను పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా భారీ గాలులు వీచినప్పుడు విద్యుత్ స్తంభాలు విరిగిపోకుండా ఉండాలంటే, తయారీ దశలోనే అత్యున్నత ప్రమాణాలు పాటించాలని అధికారులను, తయారీదారులను ఆదేశించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండాలంటే స్తంభాల పటిష్టత చాలా ముఖ్యమని, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

బేకరీలో ఇదేం నిర్వాకం? సోదాల్లో బయటపడ్డ షాకింగ్ దృశ్యాలు!

ఉప్పల్‌లోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై SOT, M-FAST అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సోదాల్లో అధికారులు పలు అంశాలను పరిశీలించారు.

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ ఊరట.. ఏజ్ లిమిట్ పెంపు!

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
spot_img

Related Articles

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వేయి స్తంభాల గుడిలో ‘ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి’ ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి.