హనుమకొండ జిల్లాలోని భట్టుపల్లి ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది.
ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తనను గమనించిన విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


