వరంగల్: హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని వరంగల్ మహానగరంలో భారీ ఎత్తున ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన ఈ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం వరంగల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విహెచ్‌పి నేతలు ఆవిష్కరించారు.
ఏప్రిల్ 2, హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 4 గంటలకు రంగశాయిపేట నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. నగరం గుండా సాగి హయగ్రీవాచారి మైదానం వద్ద ర్యాలీ ముగుస్తుంది.
ఈ సందర్భంగా విహెచ్‌పి నేతలు మాట్లాడుతూ, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు.


