HomeLatest Newsపాలీటెక్నిక్ విద్యార్థుల పోరుకు మద్దతు వెళుతుండగా బ్రేక్: మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

పాలీటెక్నిక్ విద్యార్థుల పోరుకు మద్దతు వెళుతుండగా బ్రేక్: మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

Published on

spot_img

పాలీటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై పోరాటానికి మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును పోలీసులు గురువారం ఉదయం ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు.

రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లాలో పాలీటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి పోరాటానికి పూర్తి సంఘీభావం తెలిపేందుకు హరీష్ రావు వరంగల్ పర్యటనను ఖరారు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో, ముందుస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. నివాసం చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం:

పోలీసుల చర్యపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వినాల్సింది పోయి, రద్దు చేయాల్సిన జీవో 97ను పక్కనబెట్టి నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని విమర్శించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా విద్యార్థుల తరఫున బిఆర్ఎస్ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

హరీష్ రావు అరెస్ట్ వార్త తెలియడంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద అలాగే వరంగల్‌లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.