HomePoliticsవరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై హరీష్ రావు ఆగ్రహం

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై హరీష్ రావు ఆగ్రహం

Published on

spot_img

వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను మాజీ మంత్రి T Harish Rao పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేసామని, నిధులు కూడా సమకూర్చామని తెలిపారు. ఫినిషింగ్ పనులు చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు. జూన్ 2న హాస్పిటల్ ప్రారంభిస్తామని చెప్పడం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు.

దేవాదుల ప్రాజెక్టుపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సందర్శన తర్వాత మోటార్లు విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలు బిఆర్ఎస్ పోరాట ఫలితమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క ఎకరా భూ సేకరణ కూడా చేయలేదని ఆరోపించారు. డెడ్‌లైన్లు మారుతున్నా పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి Revanth Reddy పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, అసెంబ్లీలో మైక్ ఆపకుండా మాట్లాడే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. గోదావరి ప్రాజెక్టుల విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున పనులు పూర్తి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

వరంగల్‌లో గుండె శస్త్రచికిత్సల సౌకర్యాలు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, MGM Hospital లో ఆక్సిజన్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం, మందుల కొరత, వైద్యుల కొరత ఉన్నాయని ఆరోపించారు.

హాస్పిటల్‌ను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే అక్కడే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని, ఉద్యోగులకు పెండింగ్ పీఆర్‌సీ బకాయిలు అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల విషయాల్లో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

Latest articles

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.

బొప్పాయిని రోజూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

రోజూ పరిమిత మోతాదులో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
spot_img

Related Articles

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొండా దంపతులకు జనసేనలో నో ఎంట్రీ? సుస్మితకు మాత్రమే గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీలను జనసేన పార్టీలోకి తీసుకోవద్దనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు మాత్రమే పార్టీలోకి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.