HomeWarangal Newsహసన్‌పర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య

హసన్‌పర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య

Published on

spot_img

 హసన్‌పర్తి మండల కేంద్రంలో ఈరోజు సందడి నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (WDCB) ప్రారంభం:-

Dr Kadiyam Kavya

మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శాఖను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గారు కలిసి ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులకు మరియు స్థానిక ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీతంపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు :-

Indiramma Illu

అనంతరం, హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే, ఎంపీ మరియు ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేఆర్ నాగరాజు,కడియం కావ్య,హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు & KUDA చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, హన్మకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు తోకల లక్ష్మారెడ్డి, పోరెడ్డి మహేందర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ తంగేళ్లపల్లి తిరుపతి, గొర్రె కిరణ్‌తో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.